Breaking News
Loading...
Friday, 14 October 2011

Info Post

మొగల్ పరిపాలన


క్రీ.శ. 1526 లో బాబర్ తో డిల్లీలో మొఘల్ చక్రవర్తుల పాలన ఆరంభమైంది. ఇతని తరువాత ఈ వంశపు చక్రవర్తులలో హుమాయున్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు ముఖ్యులు. వీరిలో అక్బర్ హిందువుల పట్ల మతపరమైన సహనంతో వ్యవహరించాడని చెబుతారు. రాజపుత్ర రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కాని ఇతని కాలంలో చాలా హిందూ రాజ్యాలు స్వతంత్రం కోల్పోయాయి. హిందూ మతం పట్ల అక్బర్ చూపించిన సహన శీలతపై అహద్ సర్ హిందీ అనే సూఫీ తీవ్రంగా మండిపడ్డాడు. "షరియత్ ను (ఇస్లామిక్ చట్టాన్ని) ఖడ్గంతో వ్యాప్తి చేయాలి. ఇస్లాం యొక్క గౌరవం కాఫిర్లను అవమానిచాడంలోనే ఉంది. హిందువులు విలువైన వస్త్రాలు ధరించలేక, వైభవంగా జీవించలేక అవమానాల పాలయ్యేలా చూడాలి" అని బోధిస్తూ ఆనాటి ఆస్థాన ప్రముఖులలో చాలామందికి లేఖలు వ్రాశాడు. జహంగీర్ చక్రవర్తి సిక్కుల గురువైన అర్జున్ సింగును చంపించాడు. ఔరంగజేబు హిందూ మతంపై విషం కక్కాడు. హిందువులపై జీజియా పన్ను విధించాడు. కాశీ విశ్వనాధాలయం, మధురలోని శ్రీ కృష్ణాలయం, గుజరాత్ లో పునర్నిర్మాణమైన సోమ
నాధాలయం మొదలైన అనేక హిందూ దేవాలయాలను కూలగొట్టించాడు. సిక్కుల తొమ్మిదవ గురువైన తేగ్ బహదూర్ ను చంపించాడు.

ఛత్రపతి శివాజీ - హిందూ పద్ పాదుషాహి




ఈ కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ అనే హిందూ వీరుడు జన్మించాడు. అతనికి తల్లి జిజియా బాయి చిన్నతనంలోనే హిందూ పురాణ గాధలు, రాముడు, అర్జునుడు మొదలైన భారత వీరుల కథలు చెప్పి, హిందూ ధర్మ రక్షణ చేయాల్సిందిగా బోధించింది. శివాజీ చిన్న వయసులోనే హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాడు. నిశితమైన మేథస్సుతో, కాలానుగుణమైన యుద్ధ తంత్రంతో మొగల్ సామ్రాజ్యం పైనా, బీజాపూర్ రాజ్యం పైనా దాడులు జరిపి తన రాజ్యాన్ని విస్తరించాడు.
"శివాజీ కనుక జన్మించి ఉండకపోతే కాశీకి కళ పోయి ఉండేది, మధుర మసీదుగా మారి ఉండేది, హిందువులకు సున్నతి జరిగి ఉండేది" అని భూషణ కవి గానం చేశాడు.


దేశవ్యాప్త మొగల్ వ్యతిరేకత - సామ్రాజ్య పతనం

తన తండ్రిని ఔరంగజేబు చంపించడంతో ఆగ్రహించిన గురు గోవింద్ సింగ్ సిక్కులలో ఖాల్సా సంప్రదాయాన్ని ఆరంభించి, వారికి కటోరమైన ఆయుధ శిక్షణనిచ్చి, వీర జాతిగా తీర్చిదిద్దాడు. సంత్ ప్రాణ నాథ్ మార్గదర్శనంలో చత్రసాల్ అనే రాజపుత్ర వీరుడు బుందేల్ ఖండ్ ప్రాంతాన్ని మొగలుల ఆధిపత్యం నుంచి విముక్తి చేశాడు. లాచిత్ బడ ఫుకాన్ అనే హిందూ వీరుడు ఔరంగజేబు సైన్యాలను అస్సాంలోకి రాకుండా అడ్డుకుని, ఓడించి, తరిమివేశాడు. నేడు పాకిస్తాన్, పంజాబ్, కాశ్మీర్, హర్యానాలుగా ఉన్న ప్రాంతమంతటి పైనా సిక్కుల రాజు రంజిత్ సింగ్ సామ్రాజ్యాధిపత్యం స్థాపించాడు. బాజీరావు మొదలైన మహారాష్త్ర పీష్వాలు మొగలు సామ్రాజ్యాన్ని క్షీణ దశకు తీసుకు వచ్చారు. చివరికి దిక్కుమాలిన మొగలు చక్రవర్తి మహారాష్ట్ర సైనిక దళాల రక్షణలో కాలం గడిపే స్థితి వచ్చింది. ఇలా ఆరు శతాబ్దాల సంఘర్షణ తరువాత హిందువులది పై చేయి అయ్యింది.


పునరాహ్వాన దృష్టి లేని హిందుత్వ వాదులు

కానీ మతమార్పిడులలో ముస్లింలు సాధించిన ఫలితాలు మాత్రం వారికే స్థిరపడి పోయాయి. మతం మార్చబడిన కోట్లాది హిందువులను హిందూ రాజులు, మతాచార్యులు ప్రేమతో ఆహ్వానించి ఉంటే వారు సంతోషంగా తమ పూర్వపు మతంలోకి వచ్చేసి ఉండేవారు. కానీ ఆ హిందూ రాజులకు, హిందూ మతాధిపతులకు ఆ సంకల్పం, దూరదృష్టి లేకపోయాయి.



అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర

మొగల్ పాలనా అంతమై పోతోందని, మహారాష్ట్రులు భారత చక్రవర్తులు కాబోతున్నారని అనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇది ఇస్లాం మతాచార్యులకు సహించరానిదైనది. షా వరియుల్లా అనే సూఫీ తన కాలపు ముస్లిం రాజులకు, సేనాధిపతులకు "హిందువులను వధించండి. వాళ్ళను మతం మార్చండి. ఖురాన్లోని ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించండి" అని ప్రబోధిస్తూ వందల కొద్దీ లేఖలు వ్రాశాడు. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీ ని భారతదేశంపై దండెత్తి రమ్మని ఆహ్వానిస్తూ "పూర్వ కాలంలో ఇస్లాం రాజులు ఈ దేశాన్ని జయించడానికి చాలా కష్ట పడ్డారు. ప్రస్తుతం దేశంలో అధికారం హిందువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో హిందూస్తాన్ పైకి దండెత్తి వచ్చి మరాఠాల శక్తిని నాశనం చెయ్యడం మీ పవిత్ర కర్తవ్యం. మీకు లెక్క లేనంత దోపిడీ సొత్తు లభించును గాక" అని లేఖ వ్రాశాడు.


కలిసిరాని పానిపట్టు యుద్ధం - మరాఠాల పతనం - ఆంగ్లేయులకు ద్వారం

భారత్ పైకి దండెత్తి వచ్చిన అహ్మద్ షా అబ్దాలీతో మహారాష్ట్రులకు పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఈ మూడవ పానిపట్టు యుద్ధం తీవ్రంగా సాగుతుండగా మహారాష్ట్ర సైన్యంలోని ముస్లిం సైనికులు ద్రోహానికి పాల్పడ్డారు. దానితో మహారాష్ట్రులు దారుణమైన ఓటమిని పొందారు. మరాఠా యోధులు అత్యధిక సంఖ్యలో మరణించడంతో మహారాష్త్ర ప్రాభవం కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ పరిణామం భారతదేశంపై ఆధిపత్యం మహారాష్ట్రులకు కాక ఆంగ్లేయులకు చిక్కడానికి, తద్వారా ఈ దేశంలో క్రైస్తవమత ప్రాబల్యానికి దారి తీసింది.


Source : Lokahitham.net

0 comments:

Post a Comment