సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31 న గుజరాత్ లోని నాడియాడ్ లో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ రోజుల్లో దేశంలో ఉన్న 554 సంస్థానాలను స్వల్ప వ్యవధిలో దేశంలో విలీనం చేసిన ఖ్యాతి పటేల్ దే. పటేల్ అనాడు అలా చేసి ఉండకపోతే భారతదేశం ఇంత సమైక్యంగా ఉండేది కాదు. 1947 లో బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన అనివార్యం చేశారు. ఆ సమయంలో దేశ విభజననుద్దేశించి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇలా అన్నారు. -"శరీరమంతా బాధ పడకుండా కుళ్ళిపోయిన అవయవాన్ని ఖండించి, మిగిలిన శరీరాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. ఇప్పుడు దేశ విభజనకు ఒప్పుకోకపోతే ఇప్పట్లో స్వాతంత్ర్యం వచ్చే అవకాశమే లేదు. మొత్తాన్ని కోల్పోయే ప్రమాదముంది. దానికంటే కొంత వదులుకోవడానికి నేను ఇష్టపడతాను".
Source : http://www.lokahitham.net/2011/10/554.html
0 comments:
Post a Comment